అఫీషియల్: RRR సినిమా విడుదల వాయిదా..!

Published on Jan 1, 2022 5:54 pm IST


టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు, యావత్‌ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో రిలీజ్ చేయలేమని, ఎంతో కష్టపడి పనిచేసినా, కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవని, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు ప్రకటించడం మరియు థియేటర్లు మూతపడుతుండడంతో విడుదల వాయిదా తప్పలేదని చెప్పుకొచ్చింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలను అలాగే ఉంచాలని కోరుతున్నామని, మంచి సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని చిత్ర బృందం తెలిపింది.

సంబంధిత సమాచారం :