“RRR” స్పెషల్ కట్ ని వారికి చివరగా స్పెషల్ షో..డీటెయిల్స్ ఇవే.!

“RRR” స్పెషల్ కట్ ని వారికి చివరగా స్పెషల్ షో..డీటెయిల్స్ ఇవే.!

Published on May 15, 2022 10:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి లాంటి సెన్సేషనల్ ట్రయో నుంచి వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యిన అన్ని చోట్లా భారీ వసూళ్లతో అదరగొట్టింది.

మరి ఇదిలా ఉండగా రీసెంట్ గానే 50 రోజులు పూర్తి చేసుకొని ఓటిటిలో కూడా స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఒక టాక్ బయటకి వచ్చింది. ఈసారి ఈ సినిమాకి సంబంధించి ఫైనల్ ఒరిజినల్ కట్ ని మేకర్స్ చివరి సారిగా థియేటర్స్ లో ప్రదర్శితం చెయ్యడానికి సిద్ధం చేశారట.

అయితే అది యూఎస్ మార్కెట్ లో అన్నట్టు తెలుస్తుంది. అది కూడా కేవలం ఒక్క షో మాత్రమే ఈ జూన్ 1న ప్లే చేస్తున్నారట. అందులోని మళ్ళీ కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో 100 కి పైగా స్క్రీన్ లలో షో వేస్తున్నారని కన్ఫర్మ్ అయ్యింది. దీనితో ఇప్పుడు అక్కడ ఉన్నవారు మళ్ళీ చివరి సారిగా బిగ్ స్క్రీన్స్ పై ఒకసారి చూడాల్సిందిగా అందరూ కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు