“ఆర్ఆర్ఆర్” మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందంటే?

Published on Dec 10, 2021 12:00 am IST


టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతున్న నేపధ్యంలో నేడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ట్రైలర్‌ను చూసాక ఇప్పుడు ఎక్కడ చూసినా “ఆర్ఆర్ఆర్” సినిమా గురుంచే చర్చ నడుస్తుంది.

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో థియేటర్లలో విడుదలవుతున్న పలు సినిమాలు మూడు, నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి దర్శనమిస్తున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ కూడా మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉండొచ్చని పలువురు మాట్లాడుకుంటున్నారు. కానీ అలాంటి వారికి మూవీ మేకర్స్ చేదు వార్త చెప్పారు. ఆర్ఆర్ఆర్ చిత్రం థియేటర్లలో విడుదలైన మూడు నెలల వరకు ఓటీటీలో విడుదల కాదని మూవీ మేకర్స్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆల్ లాంగ్వేజెస్ ఓటీటీ హక్కులను బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ సంస్థ దక్కించుకుంది. తెలుగు ఓటీటీ హక్కులను జీ5, హిందీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థలు కొనుగోలు చేసాయి.

సంబంధిత సమాచారం :