ఓటిటిలో “RRR” ఇలా స్ట్రీమింగ్ కి వస్తుందా?

Published on May 7, 2022 1:00 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా కూడా నిలిచింది. అయితే ఇప్పుడు థియేట్రికల్ గా రన్ ని పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ఓటిటి లోకి వస్తుంది అని గత కొన్ని రోజులు నుంచి టాక్ ఉంది.

మరి ఈ సినిమా ఓటిటి హక్కులు కొనుగోలు చేసిన జీ సంస్థ వారు ఈ సినిమాని ఈ మే 20న స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారట కానీ దీనిని కూడా జీ ప్లెక్స్ లో పే మోడల్ లో తీసుకొస్తన్నారట. అయితే ఇది ఒకింత డిజప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. మరి ఇన్ని తర్వాత కూడా ఓటిటి లో డబ్బులు పెట్టే చూడాలి అంటే ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :