“RRR” ఈ వెర్షన్ లో పికప్ ఓ రేంజ్ లో ఉందట.!

“RRR” ఈ వెర్షన్ లో పికప్ ఓ రేంజ్ లో ఉందట.!

Published on Mar 27, 2022 9:00 AM IST

ప్రస్తుతం మరోసారి ఇండియన్ సినిమా పేరు మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా మారు మోగేలా చేసిన భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారీ బడ్జెట్ తో దర్శక దిగ్గజం రెండు పవర్ ఫుల్ ఫోర్సెస్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో చేసిన ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.

అన్ని భాషల్లో కూడా అద్భుతమైన పికప్ మరియు సాలిడ్ బుకింగ్స్ తో రికార్డులు తిరగ రాస్తున్న ఈ భారీ సినిమా ముఖ్యంగా మొదటి రోజు రోజు కంటే తర్వాత మాత్రం హిందీ వెర్షన్ లో సాలిడ్ గా పికప్ ని అందుకుంటుంది అట. మొదటి రోజు కంటే హిందీ వెర్షన్ కి మాత్రం తర్వాత ఎక్కువ ఫుట్ ఫాల్స్ ఒక్క ఇండియా లోనే కాకుండా ఆశ్చర్యకరంగా ఓవర్సీస్ లో కూడా పడుతున్నట్టు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తుంది.

ఒక్కసారి గాని హిందీ మార్కెట్ లో సినిమా పికప్ అయ్యి స్టాండర్డ్ గా నిలబడితే ఆ సినిమా వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయో చాలా సినిమాలు ప్రూవ్ చేసాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఈ చిత్రం కూడా చేరింది సో ఫైనల్ రన్ లో అయితే ఊహించని నంబర్స్ ని నమోదు చేసినా ఆశ్చర్య పడక్కర్లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు