ఒక్క ఏపీలో టికెట్ ధరలపై “RRR” నిర్మాత కీ కామెంట్స్.!

Published on Dec 11, 2021 1:01 pm IST

వచ్చే ఏడాది తెలుగు సినిమా నుంచి మాత్రమే కాకుండా మొత్తం ఇండియన్ సినిమాకే ఒక కొత్త ఆరంభాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న భారీ సినిమా “RRR”. దర్శక ధీరుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యోంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తీసిన పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ మళ్ళీ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడం ఖాయం అని ఆల్రెడీ అర్ధం అయ్యిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా వసూళ్లకు మాత్రం ఖచ్చితంగా ఏపీలో గట్టి ప్రభావం ఉంటుందని చెప్పాలి. అకస్మాత్తుగా టికెట్ ధరలు తగ్గించడంతో అనేక సినిమాలకు ఇది ఎక్కువ ప్రభావం చూపడం స్టార్ట్ అయ్యింది. అయితే ఈ ఇష్యూ పై టాలీవుడ్ పెద్దలకి అలాగే ఏపీ ప్రభుత్వానికి ఎప్పుడు నుంచో కీలక చర్చలు జరుగుతున్నాయి కానీ ఇంకా ఎలాంటి పాజిటివ్ వార్తలు అయితే రాలేదు.

అయితే ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ‘RRR’ సినిమా నిర్మాత అయినటువంటి డీవీవీ దానయ్య కొన్ని కీ కామెంట్స్ చేశారు. భారతదేశం అంతా ఉన్న ఒక ధరలు ఏపీలో మాత్రం ఉన్న వేరే ధరలు ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని కానీ ఇంకా ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని ఒక సానుకూలమైన స్పందనే వస్తుందని అనుకుంటున్నామని ఆయన తెలిపారు. మరి ఇప్పటికే ఈ సినిమా ఈ సినిమా స్థాయికి తగ్గ బిజినెస్ నే జరిపింది మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :