“ఆర్ ఆర్ ఆర్” ట్రియో రచ్చ మామూలుగా లేదుగా!

Published on Dec 20, 2021 4:00 pm IST

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కానుండటం తో ఒక రేంజ్ లో ప్రమోషన్స్ ను మొదలెట్టారు ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్. ఇప్పటికే హిందీ భాష కి సంబంధించి ప్రమోషన్స్ వేగవంతం గా జరుగుతున్నాయి. బాలీవుడ్ లో ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రం హిందీ వెర్షన్ కి ఇప్పటికే ప్రీ రిలీజ్ వేడుక జరగగా, ప్రస్తుతం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ప్రత్యేక ఇంటర్వ్యూ లను ఇస్తూ బిజిగా ఉన్నారు. ఇంకా మిగతా బాషల్లో సైతం ఇదే తరహా దూకుడు కనబరిచే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :