సెకండ్ టెలికాస్ట్ కి సిద్ధమైన “RRR” చిత్రం..!

Published on Oct 4, 2022 1:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ప్రపంచ వ్యాప్తంగా అంతకంతకూ ఆదరణ పెంచుకుంటూ వెళ్తున్న ఈ చిత్రం మన తెలుగులో అయితే నెవర్ బిఫోర్ సెన్సేషనల్ హిట్ అయ్యింది.

ఆల్ టైం రికార్డు వసూళ్లతో ఎన్నో రికార్డులు వసూలు చేసిన ఈ చిత్రం మొదటిసారి స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యినప్పుడు కూడా మంచి రెస్పాన్స్ ని అయితే అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం సెకండ్ టెలికాస్ట్ కి అయితే సిద్ధం అయ్యింది. ఈ చిత్రం అయితే ఈ అక్టోబర్ 9 ఆదివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి ప్రసారం కానుంది.

మరి సెకండ్ టెలికాస్ట్ లో అయితే ఈ చిత్రం ఎంత మేర రేటింగ్ ని రాబడుతుందో ఖచ్చితంగా చూడాలి. ఇక ఈ భారీ సినిమాకి అయితే ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :