హిందీ బెల్ట్ లో రికార్డు మార్క్ అందుకున్న “RRR” వసూళ్లు.!

Published on Apr 7, 2022 9:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ యాక్షన్ మల్టీ స్టారర్ రికార్డు ఓపెనింగ్స్ అందుకొని అదిరే విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసింది. అయితే ఈ భారీ సినిమా కి సంబంధించి హిందీ బెల్ట్ లో కూడా సాలిడ్ వసూళ్లు రిలీజ్ రోజు నుంచే నమోదు అయ్యిన సంగతి తెలిసిందే.

మొదటి రెండు వారాంతాలు కూడా రికార్డు వసూళ్లు అందుకున్న ఈ సినిమా లేటెస్ట్ గా అక్కడ 200 కోట్ల నెట్ వసూళ్ల క్లబ్ లో చేరి తెలుగు నుంచి మరో 200 కోట్లు కలిగిన హిందీ సినిమాగా రికార్డు సెట్ చేసింది. అలాగే మరో పక్క ఈ సినిమా లాంగ్ రన్ లో దాదాపు 300 కోట్లు వసూలు చెయ్యొచ్చని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి అయితే హిందీ బెల్ట్ లో కూడా RRR భారీ విజయాన్ని నమోదు చేసింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :