ఓటిటిలో “RRR” సినిమా సెన్సేషన్..ఎన్ని లక్షల గంటలు అంటే.!

Published on Jun 1, 2022 9:04 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ విజువల్ వండర్ “రౌద్రం రణం రుధిరం”. రికార్డు వసూళ్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు రీసెంట్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. హిందీలో నెట్ ఫ్లిక్స్ తెలుగు మరియు ఇతర దక్షిణాది భాషల్లో జీ 5 లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

అయితే ఆల్రెడీ జీ 5 లో 1000 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ తో భారీ రికార్డు నెలకొల్పగా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా హిందీ వెర్షన్ కి గాను ఈ మే 23 నుంచి 29 మధ్యలో నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో ఈ చిత్రాన్ని ఏకంగా ఒక కోటి 83 లక్షల 60 వేల గంటలు చూశారట. దీనితో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ 1 సినిమాగా నిలిచి భారీ రికార్డును నెలకొల్పింది. దీనితో ఓటిటి లో కూడా ఈ సినిమా భారీ చేస్తుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :