RRR రిలీజ్‌పై మరోసారి పుకార్లు.. ట్రెండింగ్‌లోకి “పోస్ట్‌పోన్” హ్యాష్‌ట్యాగ్..!

RRR రిలీజ్‌పై మరోసారి పుకార్లు.. ట్రెండింగ్‌లోకి “పోస్ట్‌పోన్” హ్యాష్‌ట్యాగ్..!

Published on Jan 1, 2022 3:10 AM IST

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. వరుస అప్డేట్లను ఇస్తూ కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. అయితే ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపధ్యంలో కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించడం, 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుతుండడంతో ఈ సినిమా రిలీజ్‌ని వాయిదా వేసే అవకాశం ఉందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నా మేకర్స్ మాత్రం ఈ విషయంలో ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు.

అయితే తాజాగా మరోసారి ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిందంటూ పుకార్లు లేచొచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ ఏప్రిల్ 1వ తేదికి వాయిదా పడిందంటూ ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున నెటిజన్లు ట్వీట్లు చేయడంతో “పోస్ట్‌పోన్” అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే దీనిపై కొంతమంది అలాంటిదేమీ లేదని జనవరి 7వ తేదీనే ఆర్ఆర్ఆర్ రిలీజ్ అంటూ ట్వీట్లు చేశారు. అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఏమైనా మరోసారి అధికారికంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు