లేటెస్ట్: యూఎస్ లో భారీగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ ప్లాన్!

లేటెస్ట్: యూఎస్ లో భారీగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ ప్లాన్!

Published on Mar 15, 2022 11:00 PM IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం ను మార్చ్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాన్ ఇండియా గా పలు బాషల్లో విడుదల అవుతున్న ఈ చిత్రం యూ ఎస్ లో సైతం భారీగా విడుదల కానుంది. మొత్తం 1,150 కి పైగా లోకేషన్స్ లో ఈ చిత్రం అక్కడ భారీగా విడుదల కానుంది. మార్చ్ 24 న అక్కడ ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. శ్రియ శరణ్, అజయ్ దేవగన్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు