అఫీషియల్: ప్లాన్ మార్చిన “ఆర్ఆర్ఆర్” మూవీ…మార్చ్ 25 కి విడుదల!

Published on Jan 31, 2022 6:03 pm IST

జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి పండుగ కి విడుదల కావాల్సి ఉండగా కరోనా వైరస్ తీవ్రత మరియు పలు కారణాల వలన సినిమాను చిత్ర యూనిట్ వాయిదా వేయడం జరిగింది. ఇటీవల రెండు రిలీజ్ డేట్స్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చ్ 18 లేదా ఏప్రిల్ 28 న విడుదల చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు.

తాజాగా చిత్ర యూనిట్ ఈ రెండు తేదీలను కాకుండా, సరికొత్త ప్లాన్ తో వచ్చింది. మార్చ్ 25 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అలియా భట్, ఒలివియా మోరిస్ లు ఈ చిత్రం లో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. శ్రియ శరణ్, అజయ్ దేవగన్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం కావడం తో ప్రపంచ వ్యాప్తంగా సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :