RRR కోసం ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారంటే?

Published on Mar 11, 2022 3:00 am IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా, టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం “ఆర్ఆర్ఆర్”. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదాపడుతూ వస్తున్న ఈ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే రిలీజ్ దగ్గరపడుతుండడంతో ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకున్నారో అనే విషయం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ ఇద్దరు చెరో 45 కోట్ల చొప్పున రెమ్యునరేషన్‌గా తీసుకున్నారని, ఈ మూవీలో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్ దేవగణ్ 25 కోట్ల రూపాయలు, అలియాభట్ 9 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఇక దర్శకుడు రాజమౌళి ఈ సినిమాకు గాను తనకు, తన కుటుంబ సభ్యులకు ప్యాకేజీ తీసుకోవడంతో పాటు లాభాల్లో 30 శాతం వాటా తీసుకోబోతున్నాడట. మరోవైపు శ్రియ శరన్, సముద్రఖని కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చారని, వీరితో పాటు మ్యూజిక్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్, కెమెరా, మేకప్ లాంటి విభాగాలకు కూడా బాగానే ముట్టచెప్పినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :