“RRR” హిందీ భారీ ఈవెంట్ టెలికాస్ట్ కి టైం ఫిక్స్.!

“RRR” హిందీ భారీ ఈవెంట్ టెలికాస్ట్ కి టైం ఫిక్స్.!

Published on Dec 31, 2021 4:12 PM IST

ప్రస్తుత మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమా “రౌద్రం రణం రుధిరం” చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయకముందు ఆల్రెడీ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఒక అవార్డు వేడుక తరహాలో హిందీలో ప్లాన్ చేసి షూట్ చేశారు.

బాలీవుడ్ ప్రముఖులు సమక్షంలో ఎన్నో ఎలిమెంట్స్ తో “RRR” కీలక బృందం అంతా కూడా పాల్గొన ఈ ఈవెంట్ ని మేకర్స్ ఈరోజు కొత్త సంవత్సరం కానుకగా టెలికాస్ట్ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు దీనికి సమయాన్ని కూడా ఫిక్స్ చేసినట్టు తెలిపారు.

ఈరోజు రాత్రి 11 గంటలకి జీ టీవీ మరియు జీ సినిమాలు హిందీ ఛానెల్స్ లో ఈ భారీ ఈవెంట్ టెలికాస్ట్ కానుంది. అలాగే వచ్చే ఆదివారం కూడా ఈ ఈవెంట్ ని టెలికాస్ట్ చేయనున్నారు. మరి ఈ చిత్ర యూనిట్ సందడి ఏ స్థాయిలో ఉందో తెలియాలి అంటే ఈ ఈవెంట్ ని చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు