ఆర్ ఆర్ ఆర్ సెకండ్ సింగిల్ ప్లానింగ్ మామూలుగా లేదు…ఈ నెల 10 వ తేదీన విడుదల!

Published on Nov 5, 2021 9:32 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కుతుంది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తుండగా, అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం లో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, ఫస్ట్ సింగిల్ తో పాటుగా, గ్లింప్స్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ పై ఒక అప్డేట్ ను చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ పోస్టర్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు మాస్ స్తెపు లతో రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఈ పాట ను ఈ నెల 10 వ తేదీన చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది.

భారీ తారాగణం తో, భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :

More