ప్రపంచ వ్యాప్త ఆడియెన్స్ లో కొనసాగుతున్న “RRR” మ్యానియా.!

Published on Mar 30, 2022 2:40 pm IST


ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా మరోసారి ఇండియన్ సినిమా పేరు మారు మోగుతుంది. అలా చేసిన భారీ సినిమానే “రౌద్రం రణం రుధిరం”. దర్శక దిగ్గజం రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కించిన ఈ భారీ పీరియాడిక్ చిత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.

అయితే వరల్డ్ వైడ్ గా కేవలం తెలుగు వాళ్ళు కానీ భారతీయులలో మాత్రమే కాదు విదేశీయులని కూడా ఈ చిత్రం ఎంత గానో ఆకట్టుకుంటుంది. దీనితో వారు ఈ సినిమా చూసాక సోషల్ మీడియాలో పంచుకుంటున్న రెస్పాన్స్ లు అభిమానులకి ఇండియన్ మూవీ లవర్స్ కి మరింత గర్వకారణంగా ఈ చిత్రం నిలిచింది.

ఇలానే లేటెస్ట్ గా ఓ విదేశీయుడు RRR చూసాక తన రెస్పాన్స్ ని తెలియజేసి ఆసియన్ సినిమాల్లో తాను చూసిన వాటిలో అయితే “ఇప్ మ్యాన్” తర్వాత అంత బాగా నచ్చిన సినిమా, మిగతా బాలీవుడ్ సినిమాలని బ్రష్ అప్ చెయ్యాలని అని తెలపగా దానికి RRR వారు ఇది “ఇండియన్ సినిమా” అంటూ రిప్లై ఇవ్వడం కూడా వైరల్ గా మారింది. మొత్తానికి అయితే ప్రపంచ వ్యాప్తంగా మాత్రం RRR ఫీవర్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :