“RRR” సెన్సేషన్..”డాక్టర్ స్ట్రేంజ్” రైటర్ ఓ రేంజ్ రెస్పాన్స్.!

“RRR” సెన్సేషన్..”డాక్టర్ స్ట్రేంజ్” రైటర్ ఓ రేంజ్ రెస్పాన్స్.!

Published on Jun 7, 2022 12:00 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ “రౌద్రం రణం రుధిరం” పేరు ప్రపంచ వ్యాప్త సినిమా దగ్గర ఓ రేంజ్ లో మారుమోగుతోంది. అయితే ఈ భారీ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా అనే సినీ ప్రముఖులు నుంచి అనేక ప్రశంసలు అందుకుంటుండగా ఇప్పుడు ఇది మరింత స్థాయిలో కొనసాగుతుంది.

తాజాగా అయితే ప్రముఖ హాలీవుడ్ చిత్రం “డాక్టర్ స్ట్రేంజ్” చిత్ర రైటర్ రాబర్ట్ కార్గిల్ ఓ రేంజ్ లో తన రెస్పాన్స్ ని తెలియజేసాడు. ఈ సినిమాని నా ఫ్రెండ్స్ నా దగ్గరకి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను కూడా ఈ సినిమా ఫ్యాన్స్ లో అయ్యిపోయాను, నేను ఇప్పటి వరకు చూసిన క్రేజీయెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఇది కూడా ఒకటి నేను మళ్ళీ ఈ సినిమా చూస్తూనే ఉంటానని తన రెస్పాన్స్ ని ఓ రేంజ్ లో వ్యక్తం చేయగా చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు