నెట్ ఫ్లిక్స్ లో కొనసాగుతున్న “RRR” హవా..ఎన్ని లక్షల గంటలంటే..!

నెట్ ఫ్లిక్స్ లో కొనసాగుతున్న “RRR” హవా..ఎన్ని లక్షల గంటలంటే..!

Published on Jun 16, 2022 9:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో వచ్చిన లేటెస్ట్ మాసివ్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం”. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా థియేటర్స్ లో నెలకొల్పిన సంచలనానికి మించి ఓటిటి లో వచ్చాక ప్రపంచ వ్యాప్తంగా నిలుపుతుంది.

అనేకమంది హాలీవుడ్ ప్రముఖుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంటున్న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ అయితే ఇంకా హవా కొనసాగిస్తూనే ఉంది. గత రెండు వారాలలో 40 లక్షలకి పైగా స్ట్రీమింగ్ హావర్స్ తో నాన్ ఇంగ్లీష్ సినిమాల లిస్ట్ లో ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లో నిలిచిన ఈ చిత్రం ఇప్పటికీ అదే నెంబర్ 1 స్థానంలో ఏకంగా 52 లక్షల 30 వేలకి పైగా గంటలు స్ట్రీమింగ్స్ తో భారీ రికార్డు నెలకొల్పింది. మొత్తానికి అయితే ఈ సినిమా హవా ఇలా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు