ఓవర్సీస్ లో హిస్టారికల్ ఫస్ట్ డే రన్ సెట్ చేసిన “RRR” చిత్రం.!

Published on Mar 26, 2022 10:01 am IST

టాలీవుడ్ మాస్ హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “రౌద్రం రణం రుధిరం” విడుదల అయ్యిన యూనానిమస్ గా అన్ని భాషల్లో హిట్ టాక్ ని తెచ్చుకుంది. మరి ఈ సినిమా వసూళ్ల కోసం అంతా ఆసక్తిగా చూస్తుండగా ఓవర్సీస్ లో మాత్రం నిజంగా అద్భుతాలను నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఆల్రెడీ ఈ సినిమా ప్రీమియర్స్ లో ఆల్ టైం ఇండియన్ సినిమా రికార్డు సెట్ చెయ్యగా ఇప్పుడు ఈ సినిమా మొదటి రోజు మరియు ప్రీమియర్స్ కి కలిపి హిస్టారికల్ ఫిగర్ తో వసూళ్లు అందుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం ఓవర్సీస్ లో కేవలం ప్రీమియర్స్ మరియు మొదటి రోజుకే ఏకంగా 5 మిలియన్ డాలర్స్ ని అందుకుందట. ఇది ఒక సంచలన రికార్డు అని కన్ఫర్మ్ అయ్యింది. మరి ఫైనల్ రన్ లో ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :