ఓవర్సీస్ లో ఆల్ టైం ఇండియన్ రికార్డ్ సెట్ చేసిన “RRR”.!

Published on Mar 24, 2022 9:00 am IST


జస్ట్ మరొక్క రోజులో పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని సిద్ధంగా ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” థియేటర్స్ లో సందడి చేయనుంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా మేవ్రిక్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

మరి పలు కారణాల చేత అలా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుండగా ఓవర్సీస్ లో మాత్రం సంచలనం నమోదు చేస్తూ వచ్చింది. గతంలో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా రికార్డు స్థాయి ప్రీ సేల్స్ మరియు ప్రీమియర్స్ ని నమోదు చేసిన ఈ చిత్రం ఇప్పుడు అధికారికంగా ఇండియాస్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. 2.5 మిలియన్ డాలర్స్ ప్రీమియర్స్ తో ఈ చిత్రం ఆల్ టైం ఇండియన్ రికార్డు ని సెట్ చేసింది. మరి ఈ రికార్డు బ్రేక్ చెయ్యడానికి ఇంకెన్నాళ్లు పడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :