జపాన్ లో “RRR” మరో బిగ్గెస్ట్ రికార్డు.!

జపాన్ లో “RRR” మరో బిగ్గెస్ట్ రికార్డు.!

Published on Nov 17, 2022 10:17 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మరియు భారీ ఇట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మరి ఈ భారీ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడుకి చాలా నెలలే అయ్యినా ఈ చిత్రం ఇప్పుడు ఓవర్సీస్ లో మరింత స్థాయిలో భారీ రెస్పాన్స్ అందుకుంటుంది.

ఇక ఈ భారీ చిత్రం నెక్స్ట్ జపాన్ లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ ని నమోదు చేసింది. మరి అక్కడ భారీ వసూళ్లు నమోదు చేస్తున్న ఈ చిత్రం మళ్ళీ అక్కడ రికార్డు వసూళ్లు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రం జపాన్ లో 250 మిలియన్ యిన్స్ వసూలు చేసిన ఫాస్టెస్ట్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రం రికార్డు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ చిత్రం కేవలం 3 వారాల్లోనే ఈ ఫీట్ అందుకోవడం రికార్డు అన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు