గెట్ రెడీ: “ఆర్ఆర్ఆర్” నుంచి అదే రోజు అప్డేట్ కూడా..!

Published on Oct 27, 2021 7:49 pm IST


టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ని కూడా మేకర్స్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ని బయటపెట్టారు. ఈ అక్టోబర్ 29న ప్రపంచంలోని ఏ చిత్రానికి ఇంతకు ముందెన్నడూ చూడని మరియు వినని సహకారాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండని, ఇది అలాంటి వాటిలో ఒకటి కానుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు అదే రోజు ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ కూడా ఉండనున్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో మేకర్స్ చెప్పిన ఆ సహకారం మరియు ఆ అప్డేట్ ఏమై ఉంటుందా అని ప్రతి ఒక్కరిలో ఆసక్తి ఏర్పడింది.

సంబంధిత సమాచారం :

More