ఓవర్సీస్ లో సూపర్ స్ట్రాంగ్ గా నిలబడుతున్న “RRR” చిత్రం.!

Published on Apr 1, 2022 12:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ సినిమా ఎట్టకేలకు ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత రిలీజ్ అయ్యి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సషనల్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం విజయం మాత్రం ఒక్క మన దేశంలోనే కాకుండా ఖండాంతరాలలో కూడా సెన్సేషనల్ గా ఉందని చెప్పాలి.

అందుకు నిదర్శనంగా పలు దేశాల్లో ఈ చిత్రం హాలీవుడ్ సినిమాలను సైతం దాటడమే కాకుండా యూకే మరియు ఆస్ట్రేలియా బాక్సాఫీస్ లు దగ్గర భారీ వసూళ్ళని డే బై డే స్ట్రాంగ్ గా కలెక్ట్ చేస్తూ దూసుకెళ్తున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో ఈ ఫీట్ అందుకున్న అరుదైన ఇండియన్ సినిమాగా ఈ చిత్రం నిలబడింది అని పలు ఇంటర్నేషనల్ మీడియా వర్గాలే కొనియాడడం గమనార్హం. మొత్తానికి అయితే RRR హవా ఓవర్సీస్ లో ఇలా ఉంది.

సంబంధిత సమాచారం :