హాలీవుడ్ ప్రముఖ అవార్డ్స్ రన్నరప్ గా నిలిచిన “RRR”..!

హాలీవుడ్ ప్రముఖ అవార్డ్స్ రన్నరప్ గా నిలిచిన “RRR”..!

Published on Jul 2, 2022 8:01 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం పై ఇప్పటికీ అనేక ప్రశంసలు అందుతున్నాయి.

అయితే ఇది వరకు ఏ ఇండియన్ సినిమా కూడా అందుకోని స్థాయి అరుదైన ఫీట్ లు కూడా ఈ చిత్రం అందుకుంది. అలా రీసెంట్ గానే హాలీవుడ్ లో ప్రముఖ “హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్” నామినేషన్స్ లో అనేక హాలీవుడ్ సినిమాలతో పాటుగా కేవలం ఒకే ఒక్క ఇండియన్ సినిమాగా ఈ చిత్రం ఎంపిక అయ్యింది.

అయితే ఇప్పుడు ఈ అవార్డ్స్ లో వారు బెస్ట్ చిత్రంగా “ఎవ్రితింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ ఒన్స్” సినిమాని బెస్ట్ సినిమాగా అవార్డు గెలుచుకున్నట్టు అనౌన్స్ చేయగా ఈ సినిమా తర్వాత బెస్ట్ సినిమాగా రన్నరప్ లో RRR సినిమా నిలిచినట్టుగా తెలిపారు. ఇది ఒక గొప్ప విషయమే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు