ఎప్పుడు వచ్చినా మన స్థానం అలానే ఉంటుంది – ఆర్ ఆర్ ఆర్ మూవీ

Published on Jan 9, 2022 7:39 pm IST


రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం జనవరి 7 వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే దేశంలోని కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే

ఈ చిత్రం కి 700 కే కి పైగా బుక్ మై షో లో ఇంట్రస్ట్ లు కలిగి ఉండటం విశేషం. అయితే ఈ సినిమా ఎప్పుడు వచ్చినా తమ స్ధానం అలానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఇలా ఉన్నందున సరైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :