గర్జనకు సిద్ధంగా ఉండమంటున్న “RRR” టీం.!

Published on Jul 14, 2021 2:30 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీయుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఇటీవల కాలంలో సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు హైప్ పెంచుతూ వెళ్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ రేపు జూలై 15న ఒక అదిరే ట్రీట్ ను ఇస్తున్నట్టుగా తెలిపారు.

ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ మేకింగ్ వీడియోని వదులుతున్నట్టుగా ప్రకటించారు. భారీ హంగులతో “రోర్ ఆఫ్ ట్రిపుల్ ఆర్” అనే ట్యాగ్ తో హైలైట్ చేస్తూ వస్తున్న మేకర్స్ ఈరోజు కూడా అలెర్ట్ చేస్తున్నారు. ఈ మేకింగ్ వీడియో గర్జన కోసం సిద్ధం కమ్మని చరణ్, తారక్ అభిమానులు సహా పాన్ ఇండియన్ వైడ్ అభిమానులను ఓ పోస్టర్ తో ఇప్పుడు పలకరించారు.

రాజమౌళి మరియు సెంథిల్ కుమార్ సెట్స్ లో కలిసి ఉన్న ఫోటోని వదిలి రేపటి కోసం రెడీగా ఉండమని చెప్తున్నారు. అలాగే ఈ పోస్టర్ లో కూడా రిలీజ్ డేట్ ని అక్టోబర్ 13 కే ఉంచడం గమనార్హం. ఇక ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ స్టార్ నటులు ఆలియా భట్, అజయ్ దేవగణ్ లు కీలక పాత్రల్లో నటించారు. అలాగే డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని 400 కోట్లకు పైగా భారీ వ్యయంతో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :