అలా కాకపోతే ఇలా…రెండు రిలీజ్ డేట్ లని అఫిషియల్ గా ప్రకటించిన “ఆర్ఆర్ఆర్” టీమ్

Published on Jan 21, 2022 6:57 pm IST


కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కారణం గా దేశ వ్యాప్తంగా థియేటర్లు మూత పడుతున్నాయి. పలు చోట్ల 50 శాతం ఆక్తుపెన్సి తో సినిమాలు నడుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం తో సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

తాజాగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదిక గా మరొక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా ఉండి, కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టి, ధియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సి ఉంటే మార్చ్ 18 వ తేదీన విడుదల చేస్తాం అని తెలిపింది. అలా కాకపోతే ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన తో అభిమానులు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా, అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :