ఆర్ ఆర్ ఆర్ నుండి భీమ్, సీతారామరాజు ల సరికొత్త ఫోటోలు విడుదల!

Published on Dec 16, 2021 12:00 am IST


రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. డివీవి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కోమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యి సెన్సేషన్ సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి బుల్లెట్ నడుపుతున్న కొమురం భీమ్ ఫోటో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. అదే విధంగా రామ్ చరణ్ స్టైలిష్ గా నిలబడి ఉన్న ఫోటోను చిత్ర యూనిట్ షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :