50 రోజుల్లో “ఆర్ఆర్ఆర్”…పవర్ఫుల్ షాట్ ను విడుదల చేసిన టీమ్!

Published on Feb 3, 2022 12:05 pm IST


జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కానుంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం మార్చ్ 25 వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఇంకా ఈ చిత్రం విడుదల కి 50 రోజుల సమయం ఉండటం తో చిత్ర యూనిట్ సరికొత్త ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. రామ్ చరణ్ గుఱ్ఱపు స్వారీ చేస్తూ, ఎన్టీఆర్ బుల్లెట్ ను నడుపుతూ షూటింగ్ చేస్తున్న సమయం నాటి ఫొటో అది. 50 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది అనే విధంగా విడుదల చేయడం విశేషం. ఈ పోస్టర్ వైరల్ గా మారుతోంది.

అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు మరింత పవర్ ఫుల్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా, శ్రియ శరణ్, అజయ్ దేవగన్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇండియా లోనే తొలి బిగ్గెస్ట్ మూవీ గా భారీ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :