ఆర్ఆర్ఆర్ నుండి మాస్ పాట నేడు విడుదల…మరోక ఫోటో షేర్ చేసిన టీమ్!

Published on Nov 10, 2021 11:30 am IST

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియో లు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన రెండవ సింగిల్ నేడు సాయంత్రం విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ను సైతం చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

అయితే ఈ చిత్రం నుండి రెండవ సింగిల్ నాటు నాటు ప్రోమో కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి పాట నేడు సాయంత్రం 4 గంటలకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర యూనిట్ ఒక ఫోటో ను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటో లో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు ఉన్నారు. వీరిద్దరూ కూడా సూపర్ కూల్ గా మరియు స్టైలిష్ గా నవ్వుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :

More