అమీర్ ఖాన్ కి “ఆర్ఆర్ఆర్” మూవీ టీమ్ థాంక్స్

Published on Mar 21, 2022 12:02 am IST

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మార్చ్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించారు. డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్న నేపథ్యం లో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది.

ఈ మేరకు ఢిల్లీ లో నిర్వహించిన ఈవెంట్ కి అమీర్ ఖాన్ ను చీఫ్ గెస్ట్ గా పిలవడం జరిగింది. ఈ వేడుక లో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అమీర్ ఖాన్ ఈవెంట్ కి హాజరు కావడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తూ థాంక్స్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా అందుకు సంబంధించిన ఒక ఫోటో ను ప్రేక్షకుల తో షేర్ చేయడం జరిగింది. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :