RRR ఫర్ ఆస్కార్స్: థాంక్స్ తెలుపుతూ టీమ్ పోస్ట్!

RRR ఫర్ ఆస్కార్స్: థాంక్స్ తెలుపుతూ టీమ్ పోస్ట్!

Published on Dec 22, 2022 12:00 PM IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ను కూడా సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచింది. ఒరిజినల్ స్కోర్ విభాగం లో నాటు నాటు పాట షార్ట్ లిస్ట్ అయ్యింది. అయితే తొలి భారతీయ సాంగ్ గా నిలవడం తో భారతీయులు ఈ విషయం లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ సైతం తాజాగా పోస్ట్ చేయడం జరిగింది. ఆస్కార్స్ కి ఎంపికైన తొలి భారతీయ సాంగ్ నాటు నాటు అంటూ చెప్పుకొచ్చారు. ఈ జర్నీ లో తమకు సపోర్ట్ చేసిన వారికి థాంక్స్ తెలిపారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు