ఆర్ ఆర్ ఆర్ మూవీ టీజర్ కి ముహూర్తం ఫిక్స్!?

Published on Oct 24, 2021 8:09 pm IST

రౌద్రం రణం రుధిరం చిత్రం కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా, యావత్ భారత దేశం ఎంతగానో ఎదురు చూస్తుంది. ఈ చిత్రం ను జనవరి 7, 2022 కి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, ఫస్ట్ సింగిల్ సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన విడియోలు ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన మరొక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రం నుండి టీజర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ లేదా గ్లింప్స్ ఈ అక్టోబర్ 29 వ తేదీన విడుదల కానున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో భారీ తారాగణం తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :

More