“RRR” : తెలుగు బుల్లితెర రికార్డ్స్ కి ఎండ్ కార్డ్..టెలికాస్ట్ డేట్ ఫిక్స్.!

“RRR” : తెలుగు బుల్లితెర రికార్డ్స్ కి ఎండ్ కార్డ్..టెలికాస్ట్ డేట్ ఫిక్స్.!

Published on Aug 5, 2022 5:32 PM IST

ఇండియన్ సినిమా దగ్గర ఒక బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మన టాలీవుడ్ నుంచి వచ్చిన భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” అనే చెప్పాలి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సహా పాన్ వరల్డ్ లెవెల్లో అదరగొట్టింది.

మరి ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లో దుమ్ము లేపుతుండగా ఫైనల్ గా మన తెలుగు బుల్లితెరపై టెలికాస్ట్ కి కూడా సిద్ధం అయ్యినట్టుగా ఈ సినిమా శాటిలైట్ హక్కులు కొనుగోలు చేసిన స్టార్ మా వారు అతి త్వరలోనే టెలికాస్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు అయితే టీవీ ఛానెల్లో ఈ అవైటెడ్ ని రివీల్ చేసేసారు.

ఈ చిత్రాన్ని ఈ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముందు రోజు ఆదివారం ఆగస్ట్ 14న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేస్తున్నట్టుగా ఫిక్స్ చేసేసారు. మరి ఈ సినిమా తెలుగు నాట ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో చూసాం. ఇక టెలికాస్ట్ అయ్యాక మాత్రం డెఫినెట్ గా తెలుగు బుల్లితెర రికార్డ్స్ కి ఎండ్ కార్డ్ పడినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు