తెలుగు రాష్ట్రాల్లో “ఆర్ఆర్ఆర్” దూకుడు…3 డేస్ కలెక్షన్స్ ఇవే!

Published on Mar 28, 2022 2:00 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేస్తూ బాహుబలి 2 రికార్డు లకి చేరువ లో వెళ్తుంది. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్ల కి పైగా వసూళ్లను రాబట్టగా, మూడు రోజులో 140 కోట్ల కి చేరువ లో ఉండటం విశేషం. మూడవ రోజు తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ షేర్ రాబట్టిన చిత్రాల్లో ఆర్ ఆర్ ఆర్ టాప్ లో ఉంది.

మొత్తం 190 కోట్ల కి పైగా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ జరగగా, క్లీన్ హిట్ పొందడానికి ఇంకా 50 కోట్ల వసూళ్లను రాబట్టల్సి ఉంది. అయితే బాహుబలి తెలుగు రాష్ట్రాల్లో 204 కోట్ల రూపాయల వసూళ్లతో టాప్ లో ఉంది. ఈ వీకెండ్ ఆర్ ఆర్ ఆర్ మూవీ అదే దూకుడు కనబరిస్తే ఆ రికార్డ్ ను కొట్టడం ఖాయం. లాంగ్ రన్ లో ఎంత వసూళ్ళను రాబడుతుందో చూడాలి.

ఈ చిత్రం లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటించగా, అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించారు. శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మించగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :