“RRR” ఇంకా ఇన్ని దేశాల్లో రిలీజ్ కాబోతుందా.?

“RRR” ఇంకా ఇన్ని దేశాల్లో రిలీజ్ కాబోతుందా.?

Published on Jun 25, 2022 9:00 AM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి లో వచ్చాక మరింత క్రేజ్ ని తెచ్చుకుంది.

మరి ఓటిటి తో పాటుగా ఈ సినిమా యూఎస్, యూకే లాంటి దేశాల్లో ఇంకా స్పెషల్ షోలు కూడా రిలీజ్ చేస్తుండగా ప్రపంచ వ్యాప్తంగా అయితే మరిన్ని దేశాల్లో ఈ సినిమా ముందు రోజుల్లో రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఓవరాల్ గా 30కి పైగా దేశాల్లో రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారట. రానున్న కొన్ని నెలల్లో ఈ రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించగా డీవీవీ దానయ్య నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు