ఓవర్సీస్ లో మరో మైల్ స్టోన్ దగ్గరలో “RRR” వసూళ్లు.!

Published on Apr 6, 2022 8:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” సినిమా విడుదల అయ్యిన అన్ని చోట్ల నుంచి కూడా రికార్డు స్థాయి వసూళ్ళని అందుకుంటూ సాలిడ్ రన్ ని కొనసాగిస్తోంది. మరి ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సెన్సేషనల్ రన్ ని నమోదు చేస్తున్న ఈ సినిమా లేటెస్ట్ యూఎస్ బాక్సాఫీస్ వసూళ్ల వివరాలు బయటకి వచ్చాయి.

మరి అక్కడ ఈ సినిమా 12.75 మిలియన్ మార్క్ ని నిన్నటి రోజుతో క్రాస్ చెయ్యగా ఇప్పుడు మరో మైల్ స్టోన్ 13 మిలియన్ కి అతి దగ్గరలో ఉందని అక్కడి ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వం వహించగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. అలాగే డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :