హిందీలో మరో మైల్ స్టోన్ అందుకున్న “RRR” వసూళ్లు.!

Published on Apr 17, 2022 4:00 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం”. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ స్థాయి విజయాన్ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటుగా అన్ని ముఖ్య భాషల్లో కూడా సంచలన విజయాన్ని అందుకొంది.

మరి వీటిలో హిందీలో కూడా ఈ సినిమా సూపర్బ్ గా పెర్ఫామ్ చెయ్యగా ఇప్పుడు ఈ సినిమా అక్కడ 250 కోట్ల సెన్సేషనల్ మైల్ స్టోన్ ని అందుకుంది. నిన్న శనివారం 3.30 కోట్లు నెట్ వసూళ్లు చేసి ఈ భారీ మార్క్ కి ఈ చిత్రం చేరుకుంది. అలాగే ఈ వసూళ్లతోనే హిందీలో ఈ సినిమా మంచి రన్ ని కొనసాగిస్తోంది అని చెప్పాలి. మరి ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటులు ఆలియా భట్ మరియు అజయ్ దేవగన్ లు కీలక పాత్రల్లో నటించగా డీవీవీ దానయ్య నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :