ఇండియాలోనే “RRR” ట్రైలర్ కి నెవర్ బిఫోర్ రెస్పాన్స్.!

Published on Dec 15, 2021 3:57 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ సినిమా “రౌద్రం రణం రుధిరం”. పాన్ ఇండియన్ వైడ్ భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన మోస్ట్ అవైటెడ్ మాసివ్ ట్రైలర్ అన్ని భాషల్లో కూడా నెవర్ బిఫోర్ రెస్పాన్స్ ను కొల్లగొట్టింది. భారీ స్థాయి వ్యూస్ మరియు లైక్స్ తో ఈ సినిమా ట్రైలర్ దూసుకెళ్తుంది.

మరి లేటెస్ట్ గా ఈ మాసివ్ ట్రైలర్ ఇప్పుడు ఏకంగా 100 మిలియన్ రెస్పాన్స్ ని అందుకుని రికార్డు సెట్ చేసింది. దీనితో టోటల్ ఇండియన్ సినిమా దగ్గరే అన్ని భాషల్లో కలిపి 6 రోజుల్లో ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్ అందుకున్న ట్రైలర్ గా ఇది నిలిచింది. మరి ఇది రిలీజ్ వరకు కూడా కంటిన్యూ అవుతుందని చెప్పాలి. మరి ఈ భారీ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రేయ తదితరులు నటించగా డీవీవీ దానయ్య నిర్మాణం వహించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :