“RRR” ట్రైలర్ లాంచ్..సాలిడ్ ప్లాన్స్ డీటెయిల్స్ ఇవే.!

Published on Dec 7, 2021 10:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఇప్పుడు ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ కోసమే అంతా సరవత్రా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ ట్రైలర్ లాంచ్ సహా ఇతర ప్రమోషన్స్ పై లేటెస్ట్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి.

మొదటగా ఈ మహా ట్రైలర్ లాంచ్ గ్రాండ్ ఈవెంట్ ని పీవీఆర్ ఓబ్రియో మాల్ ముంబై లో ఘనంగా ప్లాన్ చెయ్యగా ఈ వేడుకకి గాను సినిమా దర్శకుడు రాజమౌళి అలాగే నటీనటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ లు అజయ్ దేవగణ్ సహా ఆలియా భట్ లు పాల్గొననున్నారట.

ఆ సమయంలో ఉదయం 11 గంటలకి ఈ ట్రైలర్ ని లాంచ్ చేయనున్నారట. ఇక అలాగే చిత్ర బృందం చెన్నై, బెంగళూరు సహా హైదరాబాద్ ప్రమోషన్ పర్యటనల నిమిత్తం ఏకంగా ఒక ప్రైవేట్ ఫ్లైట్ ని హైర్ చేసుకున్నారట. మొత్తానికి మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో షురూ అవ్వనున్నాయి.

సంబంధిత సమాచారం :