బాక్సాఫీస్ దద్దరిల్లేలా..ఒళ్ళు గగుర్పొడిచేలా “RRR” మాసివ్ ట్రైలర్.!

Published on Dec 9, 2021 11:13 am IST

మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్న భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమా “RRR”. ఇద్దరు మాసివ్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దిగ్గజ దర్శకుడు రాజమౌళి తీసిన ఈ మహా కావ్యం నుంచి ఒక మచ్చు తునక మరో సారి భారతీయ సినిమాని శాసించేదిలా ముందుకొచ్చింది.

ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా బిగ్గెస్ట్ థియేట్రికల్ ట్రైలర్ ని ఇప్పుడు మేకర్స్ అనేక అంచనాల నడుమ విడుదల చేశారు. తెలుగు నేలకి చెందిన నిజ జీవిత హీరోలు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీం లతో 1920ల నాటి ఫిక్షనల్ గా తయారు చేసిన సినిమానే ఈ “రౌద్రం రణం రుధిరం” మరి ఇలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కించిన సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

భీమ్ కోన ప్రాంతానికి చెందిన ఓ చిన్న పాపని బందీగా తీసుకొచ్చే బ్రిటిష్ వారి సన్నివేశం నుంచి మొదలైన ఈ ట్రైలర్ వారికి కాపరిగా ఉన్న బెబ్బులి కొమరం భీమ్ విజువల్స్ తో మైండ్ బ్లోయింగ్ గా స్టార్ట్ అయ్యింది. అంతా ఎదురు చూస్తున్న పులితో పోరాట సన్నివేవా విజువల్ అదిరిపోయింది. అలాగే అలాంటి భీం ని కంట్రోల్ చెయ్యగలిగే పోలీస్ అధికారిగా అల్లూరి సీతారామరాజుగా చరణ్ పాత్ర పరిచయం అయ్యి అక్కడ నుంచి రాజమౌళి మార్క్ ఎమోషన్స్ లోకి ఈ ట్రైలర్ వెళ్ళింది.

ఇవి కూడా ఎంతో అమోఘం తర్వాత ఇరువురి మధ్య స్నేహ బంధం దానికి తగ్గట్టుగా కీరవాణి మ్యాజికల్ నేపథ్య గీతం గూస్ బంప్స్ ఇస్తుంది. ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అసలు రచ్చ. విల్లు పట్టుకొని రామరాజు చేసిన యుద్ధ విన్యాసాలు నెక్స్ట్ లెవెల్ ఫీస్ట్ తర్వాత భీమ్ పై డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్ లు కానీ డైలాగ్స్ కానీ ఇద్దరు మధ్య యుద్ధాలు కానీ ప్రతి ఒక్కరికీ గగుర్పొడిచేలా..

బాక్సాఫీస్ బద్దలు అయ్యేలా అనిపిస్తున్నాయి. ఇంకా డీవీవీ దానయ్య ఖర్చు అంతా ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది. గ్రాఫికల్ టీం వర్క్ కానీ యాక్షన్ సీక్వెన్స్ ల డిజైన్ కానీ మరో స్థాయిలో ఉన్నాయి. ఇక అంతా సిద్ధం అవ్వాల్సింది వచ్చే జనవరి 7 కోసమే.. థియేటర్స్ లో ఈ బిగ్గెస్ట్ మ్యాజికల్ ట్రీట్ ని చూడడం కోసమే.

RRR ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :