టాక్..”RRR” ట్రైలర్ ఇంత త్వరగానా..?ఛాన్స్ ఉందా?

Published on Nov 24, 2021 9:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తీసిన భారీ పాన్ ఇండియన్ సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పుడు మూడో మోస్ట్ అవైటెడ్ సాంగ్ ఫీల్ గుడ్ ఎమోషనల్ నెంబర్ రిలీజ్ కి రెడీగా ఉంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై అప్పుడే ట్రైలర్ కట్ రెడీగా ఉంది అని ఓ టాక్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అది కూడా ఈ వచ్చే డిసెంబర్ మొదటి వారం లోనే అట. అయితే జనవరి రిలీజ్ అయినా ఇంత త్వరగా రిలీజ్ చేస్తారా అనే డౌట్ కూడా లేకపోలేదు.

మినిమమ్ ఒక రెండు వారాల గ్యాప్ లో అలా ఈ భారీ సినిమా ట్రైలర్ రావొచ్చేమో కానీ ఇంత త్వరగా అనేది డౌట్ అనే చెప్పాలి. ప్రస్తుతానికి అయితే ఈ టాక్ వైరల్ అవుతుంది మరి ఇందులో ఎంతమేర నిజముందో వేచి చూడాలి. ఇక ఈ భారీ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More