గెట్ రెడీ: “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ నిడివి ఎంతంటే?

Published on Dec 9, 2021 3:00 am IST


టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా జోరుగానే చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఈ సినిమా ట్రైలర్‌ని నేడు విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు థియేటర్లలో, సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్‌లో రిలీజ్ కానున్న ఈ ట్రైలర్ నిడివి ఎంతసేపు ఉంటుంది అనే దానిపై తాజాగా చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. 3 నిమిషాల 07 సెకన్ల నిడివి ట్రైలర్ ఉండబోతుందని రెడీగా ఉండమని చిత్ర యూనిట్ తెలిపింది.

సంబంధిత సమాచారం :