టాలీవుడ్ లో మరో ఫాస్టెస్ట్ రికార్డ్ సెట్ చేసిన “RRR” ట్రైలర్.!

Published on Jan 15, 2022 9:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తీసిన భారీ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం” పై ఉన్న హైప్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాన్ ఇండియా వైడ్ ఆల్ మోస్ట్ బ్లాస్ట్ కన్ఫర్మ్ అనుకోగా ఊహించని రీతిలో కరోనా మూడో వేవ్ కారణంగా సినిమా అధికారికంగా వాయిదా పడింది.

దీనితో మొత్తం పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎంతలా నిరాశ పడ్డారో చూసాం. అయితే ఈ సినిమా హైప్ తీవ్ర స్థాయిలోకి తీసుకెళ్లింది మాత్రం ఈ సినిమా ట్రైలర్ అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి అండ్ టీం కట్ చేసిన సాలిడ్ యాక్షన్ ట్రీట్ ట్రైలర్ భారీ రెస్పాన్స్ తో ఇండియా వైడ్ దుమ్ము లేపింది.

మరి అటు హిందీలో కూడా సెన్సేషన్ ని నమోదు చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు తెలుగులో మరో ఫాస్టెస్ట్ రికార్డు అందుకొని కొత్త మార్క్ ని సెట్ చేసింది. మరి ఈ ట్రైలర్ లేటెస్ట్ గా 50 మిలియన్ వ్యూస్ అందుకొని టాలీవుడ్ ఫాస్టెస్ట్ 50 మిలియన్ ట్రైలర్ గా రికార్డులు సెట్ చేసింది. ఆల్రెడీ ఈ ట్రైలర్ ఫాస్టెస్ట్ లైక్స్ తో ఆల్ టైం రికార్డు సెట్ చెయ్యగా ఇప్పుడు వ్యూస్ లో మరో రికార్డు అందుకుంది.

సంబంధిత సమాచారం :