తమ హీరోయిన్ సీతకి “RRR” యూనిట్ స్పెషల్ విషెష్..!

Published on Feb 25, 2022 12:12 pm IST


ఈ రెండు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గరకి కొన్ని భారీ సినిమాలే రిలీజ్ కి వచ్చాయి. వాటిలో అజిత్ కుమార్ భారీ సినిమా “వలిమై” నిన్న రిలీజ్ కాగా ఈరోజు రెండు సాలిడ్ సినిమాలు విడుదలకి వచ్చాయి. మరి వీటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు నటించిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్” ఒకటి కాగా మరొకటి పాన్ ఇండియా లెవెల్లో చేసిన చిత్రం “గంగూబాయి కతియవాది”. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన ఈ చిత్రాన్ని స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు.

మరి మంచి అంచనాలు నడుమ రిలీజ్ ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ చిత్ర యూనిట్ కి మరియు తమ హీరోయిన్ ఆలియా భట్ కి మరో భారీ సినిమా యూనిట్ “రౌద్రం రణం రుధిరం” వారు తమ స్పెషల్ విషెష్ ని తెలియజేసారు. మా డియరెస్ట్ ఆలియా అండ్ గంగూబాయి టీమ్ కి బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నామని తెలిపారు. మరి తమ సినిమాలో ఆలియా భట్ చరణ్ సరసన సీత పాత్రలో నటించగా ఈ సినిమాని హిందీలో ప్రెజెంట్ చేస్తున్న పెన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :