“పుష్ప” టీంకి “RRR” యూనిట్ ఎనర్జిటిక్ విషెష్.!

Published on Dec 17, 2021 10:00 am IST

ఈరోజు మరో టాలీవుడ్ బిగ్గెస్ట్ రిలీజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం “పుష్ప ది రైజ్” తో రానే వచ్చింది. మూవీ లవర్స్ అంతా కూడా అల్లు అర్జున్ మరియు సుకుమార్ ల హ్యాట్రిక్ మ్యాజిక్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అందరి అంచనాలు అందుకునే విధంగా ఈ చిత్రం భారీ లెవెల్ రిలీజ్ తో ఈరోజు రాగా టాలీవుడ్ నుంచి అనేక మంది సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రానికి చిత్ర యూనిట్ కి స్పెషల్ విషెష్ తెలియజేస్తున్నారు.

మరి ఇలా ఈ పాన్ ఇండియా సినిమాకి మరి బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమా అయినటువంటి “RRR” యూనిట్ వారు తమ సాలిడ్ విషెష్ ని తెలియజేసారు. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటున్నందుకు కంగ్రాట్స్ చెప్తూ థియేటర్స్ లో ఆడియెన్స్ మాస్ పార్టీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తగ్గేదేలే అంటూ ఎనర్జిటిక్ విషెష్ ని తెలియజేసారు. దీనితో ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :