బిగ్ డెసిషన్ : ఏపీలో టికెట్ ధరలపై “RRR” యూనిట్ కీలక అడుగు.!

Published on Nov 14, 2021 10:19 am IST

గత కొన్ని నెలల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలకు సంబంధించి పెద్ద మిస్టరీ నే నడుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అనూహ్యంగా తగ్గించేసిన టికెట్ ధరలతో టాలీవుడ్ కి పెద్ద దెబ్బే తగిలింది. మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ పై పెద్ద ఎత్తున తన గళం వినిపించగా పెద్ద రచ్చ కూడా లేచింది. అయినా కూడా ఏపీలో ఈ టికెట్ దరల అంశం సర్దుమణిగే దారి కనిపించలేదు.

ఇక ఇదే కనుక కంటిన్యూ అయితే ఖచ్చితంగా భారీ సినిమాలకు తీవ్ర నష్టం తప్పదు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానంగానే తెలుగు ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా మార్కెట్ కి వెళుతున్న భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” యూనిట్ కీలక చర్చలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో చేసేందుకు పూనుకున్నారు.

ఈ సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ విషయాన్ని వెల్లడించారు. ”టికెట్ ధరలు తగ్గించడం మూలాన సినిమా పరిశ్రమ నష్టపోతుంది అనే మాట వాస్తవం. అయితే మేము ఈ సమస్యపై కోర్టు దగ్గరకి వెళ్ళాలి అనుకోలేదు.. దీనిని గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడి పరిష్కరించాలి అనుకుంటున్నామని” వారు క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :

More