అక్కడ దంచి కొడుతున్న RRR… మామూలుగా లేదుగా!

Published on Apr 10, 2022 11:04 pm IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం కి సర్వత్రా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మార్చ్ 25 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల అయిన ఈ చిత్రం అద్భుతాలు సృష్టిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, వారి పెర్ఫార్మెన్స్ సిసలైన వసూళ్ళను రాబడుతోంది అని చెప్పాలి.

ఇప్పటి వరకూ ఈ చిత్రం యూ ఎస్ లో 13.5 మిలియన్ డాలర్ల కి పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాహుబలి 2 తర్వాత ఈ తరహా లో అక్కడ వసూళ్లను రాబడుతోన్న భారతీయ చిత్రం గా నిలిచింది. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత భారీగా వసూలు చేసే అవకాశం ఉంది.

అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :