“ఆర్ఆర్ఆర్” యూఎస్ లేటెస్ట్ కలెక్షన్స్!

Published on Apr 15, 2022 10:03 pm IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ నుండి ప్రీమియర్ షో ల వరకు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం గురువారం రోజు మరో 26,272 డాలర్ల ను వసూలు చేయగా, ఇప్పటి వరకూ 13.8 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం రేపటి తో 14 మిలియన్ డాలర్ల ను వసూలు చేయనుంది.

కేజీఎఫ్ 2 చిత్రం రిలీజ్ అయ్యి, అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం తో, ఆర్ ఆర్ ఆర్ పై కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది. లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించారు. శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :